ఏపీలో గత కొన్నిరోజులు గా నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నట్టుగా కరోనా కేసులు కూడా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,925 శాంపిల్స్ పరీక్షించగా.. 184 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే మరో ముగ్గురు కరోనా తో మృతి చెందారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 134 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక తాజా గణాంకాల ప్రకారం ఏపీలో ఇప్పటివరకూ చేసిన కరోనా పరీక్షల సంఖ్య 3,04,17,082 కు చేరింది. ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,909 కు పెరగగా అందులో 20,56,318 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో 14,442 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతానికి 2,149 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.