ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 184 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 22,595 మందికి పరీక్షలు చేయగా ఈ కేసులు నమోదు అయ్యాయి. ఇక మరోవైపు కరోనా తో ఒకరు మృతి చెందారు. మరోవైపు ఇదే సమయంలో ఈ మహమ్మారి కారణంగా 183 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
కాగా తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,04,46,677 మందికి కరోనా పరీక్షలు చేయగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,093 కు చేరింది. అలాగే రికవరీ కేసుల సంఖ్య 20,56,501 కు పెరిగింది. ఇక మరోవైపు ఈ మహమ్మారి కారణంగా మొత్తం 14,443 మంది చనిపోయారు. 2,149 యాక్టివ్ కేసులు ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్నాయి.