రాజ్యసభలో 19 ఎంపీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎగువ సభలో ఏప్రిల్ తో 19 మంది ఎంపీల పదవీ కాలం ముగియనుంది. వీరిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఐదుగురి పదవీ కాలం ముగియనుంది.
కాగా రాజ్యసభలో కాంగ్రెస్ బలం 34 నుంచి 28కు పడిపోనుంది. బీజేపీ బలం 97 నుంచి 92కు చేరనుంది. ఈ జాబితాలో కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని, ప్రతాప్ సింగ్ బజ్వా, శంషేర్ సింగ్ డుల్లో, రిపుణ్ బోరా, రాణీ నరాహ్ లు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ జాబితాలో ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, రూపాగంగూలీ, స్వప్న దాస్ గుప్తా, సురేశ్ గోపీల పేర్లు ఉన్నాయి. రిటైర్డ్ అవుతున్న ఇతర ప్రముఖుల్లో మేరీ కోమ్, ఆర్థిక వేత్త నరేంద్ర జాదవ్ ఉన్నారు.