అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. టెక్సాస్ లోని ప్రాథమిక పాఠశాలలో ఓ యువకుడు(18) విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 21 మంది మరణించారు. వీరిలో 18 మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
మృతుల్లో ఎక్కువగా 4 నుంచి 11 ఏండ్లలోపు వారు ఉన్నట్టు అధికారులు వివరించారు. దీనిపై ఆ రాష్ర్ట గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేండ్లలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని ఆయన అభివర్ణించారు.
ఈ ఘటన మెక్సికన్ సరిహద్దు ప్రాంతం ఉవాల్డేలో చోటు చేసుకుంది. ఘటన అనంతరం నిందితుడికి, పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
మంగళవారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటన జరిగిన వెంటనే నిందితున్ని పోలీసులు అదపులోకి తీసుకున్నారు.
రోబ్ ఎలిమెంటరీ తుపాకీతో నిందితుడు పాఠశాలలోకి ప్రవేశించినట్టు గవర్నర్ తెలిపారు. దుండుగుడి దగ్గర రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని ఆయన వివరించారు.
కాల్పుల అనంతరం పాఠశాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఘటన సమాచారాన్ని అధ్యక్షుడు జోబైడెన్‌కు అధికారులు వివరించారు.