తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,253కు చేరింది. అటు నిన్న కరోనాతో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,589కి పెరిగింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.తాజాగా కరోనాబారి నుంచి నిన్న 376 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,88,275 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,389గా ఉంది. వీరిలో 1842 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.