కరోనా వైరస్ నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు దేశంలో దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా టీకాలు వేసినట్టుగా కేంద్రం తెలిపింది. 1,01,88,007 డోసులను పంపిణీ చేసినట్టుగా వివరించింది. కేవలం 35రోజుల్లోనే ఈ మైలురాయిని ఇండియా చేరుకుంది. తాజా రికార్డ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. మనకంటే ముందు అమెరికా, బ్రిటన్ దేశాలు ఉన్నాయి.
జనవరి 16న ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా 35రోజుల్లో ఇండియా కోటి మార్క్‌ను చేరుకుంది..అమెరికాలో అయితే 31రోజుల్లోనే కోటి మందికి వ్యాక్సిన్ వేశారు.. ఇప్పటివరకు (66 రోజులు) అక్కడ ఐదున్నర కోట్ల మందికి పంపిణీ చేశారు. ఆ తర్వాత రెండోస్థానంలో బ్రిటన్ ఉండగా.. ఇప్పటిదాకా (72రోజులు) అక్కడ కోటి 65లక్షల మందికి టీకా పంపిణీ చేశారు.