పంజాబ్‌లో సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితులు హతమయ్యారు. గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఇద్దురు గ్యాంగ్ స్టర్లు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు నిందితులు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు.
సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితులుగా ఉన్న మన్‌దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్‌ల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసున్నారని చెప్పారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్లు మన్‌దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్ మృతి చెందారని పేర్కొన్నారు.
మరో గ్యాంగ్‌స్టర్ కేశవ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని ఆయన వెల్లడించారు. తరణ్ జైలులో నిందితుల మధ్య ఎందుకు ఘర్షణ జరిగిందనే విషయాన్ని ఎస్ఎస్పీ వివరించక పోవడం గమనార్హం. సిద్దూ మూసే వాలా గతేడాది మే 29న మాన్సా జిల్లాలో హత్యకు గురయ్యారు.
సిద్దూను తానే హత్యకు తానే కారణమంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ సిద్ధూ ఒప్పుకున్నారు. ఈ కేసులో నిందితులైన మన్‌దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్‌లు గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఉన్నారు.