హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. కూకట్ పల్లి లోని రెయిన్బో విస్టా లో ఈరోజు ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. సుబ్బారావు అనే వ్యక్తికి పాజిటివ్ రావడం తో కుటుంబ సభ్యులకు టెస్ట్ లు చేయగా అపోలో మెడికల్ కాలేజిలో మెడికోగా ఉన్న అతని కొడుకుకు కూడా పాజిటివ్ గా తేలింది. సుబ్బారావు తల్లికి మాత్రం నెగెటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. రెయిన్బో లో ఉండే అందరిని అధికారులు క్వరంటైన్ చేశారు. దాదాపుగా 1800 మందిని క్వరంటైన్ చేసినట్లుగా తెలుస్తుంది.