ఓ పక్క దాదాపు 70 వేల కోట్లు తెలంగాణ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా దారి మళ్లించారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపిస్తున్నారు. మరోపక్క తెలంగాణ నీటి పారుదల స్పెషల ప్రిన్సిపల్ సెక్రెటరీ కూతురు వివాహానికి మెగా కృష్ణారెడ్డి భారీగా నిధులు సమకూర్చినట్లు ఓ వెబ్ సైట్ ఆధారాలు సమకూర్చింది.
ఈ ఆధారాల గురించి మెగా సంస్థకు ఆ వెబ్ సైట్ రిపోర్టర్ ఫోన్ చేయగానే మెగా ప్రతినిధులు ఆ సంస్థ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలిసింది. ఈ వార్తా కథనం ప్రచురించకుండా ఆపివేస్తే రెండు కోట్ల రూపాయలు లంచంగా ఇస్తామని ఆ వెబ్ సైట్ యాజమాన్యానికి ఆశ చూపినట్టు సదరు వెబ్ సైట్ ప్రతినిధులు చెప్తున్నారు.
ప్రభుత్వ ఖజానా నుంచి ప్రాజెక్టుల పేరుతో దారి మళ్లించిన వేల కోట్లను మీడియాను కొనటానికి ఉపయోగించటం మెగా బాస్ కు కొత్తేమీ కాదనేది …తాజా పరిస్థితులు గమనించిన ఎవరికైనా అర్థమైపోతుంది. వేల కోట్ల ప్రాజెక్టుల ధనం లేదా ప్రజాధనం ఇలా మెగా రిజర్వాయర్ కు చేరి, అక్కడి నుంచి వాళ్ల రాజకీయ అవసరాలు తీర్చగలిగే అన్ని చోట్లకూ ప్రవహిస్తోందనటానికి ..ప్రస్తుతం వార్తల్లోకెక్కిన ఐఏఎస్ ఇంటి పెళ్లే పెద్ద ఉదాహరణ.
మ్యారేజ్ గేట్ వార్త బయటకు పొక్కిందో లేదో.. మెగా టీం రంగంలోకి దిగనే దిగింది. ఎందుకంటే మీడియాను కొనటం వాళ్లకు కొత్తేం కాదు కాబట్టి. కానీ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే తొలివెలుగు లాంటి మీడియా సంస్థల వాయిస్ ను ఆపలేరు కదా! అటు..తొలివెలుగు ఎఫెక్ట్ తో స్వయంగా సీఎం రంగంలోకి దిగి అసలేం జరిగిందనే ఎంక్వైరీ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం.