ఊహించినట్టుగానే నార్త్ బెల్ట్ లో కేజీఎఫ్2 ఇరగదీసింది. మొదటి రోజే ఆర్ఆర్ఆర్ వసూళ్లను క్రాస్ చేసిన ఈ సినిమా, 2 రోజుల్లో వంద కోట్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్ లో విడుదల కావాల్సిన చిన్నాచితకా సినిమాలన్నీ వాయిదా వేసుకున్నారు. ఈరోజు, రేపు కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
అటు కర్నాటక, కేరళలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. వచ్చే శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. సినిమాకు యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సినిమాలన్నీ స్వచ్ఛందంగా తప్పుకున్నాయి. కేరళలో ఇప్పటికే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా.. కర్నాటక లో ఆల్ టైమ్ హిట్ దిశగా దూసుకుపోతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. మొదటి రోజు నైజాంలో 9 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు ఆ షేర్ ను 16 కోట్ల రూపాయలకు పెంచుకుంది. అటు ఏపీలో కూడా ఎక్కడా ఆక్యుపెన్సీ తగ్గలేదు. విడుదలైన ఈ 2 రోజుల్లో ఏపీ,నైజాంలో కేజీఎఫ్2 కు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 16.87 కోట్లు
సీడెడ్ – రూ. 4.79 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.91 కోట్లు
ఈస్ట్ – రూ. 1.96 కోట్లు
వెస్ట్ – రూ. 1.34 కోట్లు
గుంటూరు – రూ. 1.84 కోట్లు
కృష్ణా – రూ. 1.58 కోట్లు
నెల్లూరు – రూ. 1.17 కోట్లు