బిహార్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళుతున్న పడవ ఒకటి గండక్ నదిలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 25 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
23 మంది సురక్షితంగా బయట పడ్డారు. పడవల ఉన్న వారంత తమ స్నేహితుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతున్నారు. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో లాల్‌గంజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గండకీ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహం కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారని లాల్‌గంజ్ సర్కిల్ అధికారి పంకజ్ కుమార్ తెలిపారు. వారి మృతదేహాలను వెలికి తీశామని చెప్పారు. మరికొందరిని రక్షించినట్లు ఆయన వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని పేర్కొన్నారు.