గుండు సూదిని కూడా ఆఫర్లో కొనాలని చూస్తోంది నేటి యువత. నిజానికి ఆఫర్ అనేది ఓ ఎట్రాక్టీవ్ యాస్పెక్ట్. కస్టమర్ ఈగో సాటిస్ఫై చేసే ఓ బిజినెస్ కనికట్టు. ఫుడ్ యాప్స్ లో ప్రతిరోజూ రకరకాల పర్సెంటేజుల్లో ఆఫర్లు, డిస్కౌంట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆఫర్లకు మనం కూడా ఆకర్షితులం అవుతుంటాం.
ఆ మాదిరిగానే జొమాటో యాప్.. గులాబ్ జామ్‌లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 2 గులాబ్ జామ్‌ల ధర రూ. 400. అయితే వీటిపై 80 శాతం డిస్కౌంట్ వస్తుందని ఆ ధర కింద పేర్కొంది. అంటే ఆ రెండు గులాబ్ జామ్‌లు కేవలం రూ. 80కే వస్తాయి. ఈ ప్రకటనను భూపేంద్ర అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
అయితే 200 గ్రాముల గాజర్ హల్వా ధర రూ. 600(కేజీ రూ. 3 వేలు). 80 శాతం డిస్కౌంట్ తర్వాత 200 గ్రాముల హల్వా కేవలం రూ. 120కే వచ్చినట్లు భూపేంద్ర పేర్కొన్నాడు. రూ. 400 కే 2 గులాబ్‌జామ్‌లను పొందినప్పుడు..కేజీ రూ. 3 వేలు ఉన్న హల్వా.. 80 శాతం డిస్కౌంట్ తర్వాత ఎంతకు వస్తుంది..?
ఇంత తక్కువ ధరకు గులాబ్ జామ్‌లను విక్రయించడాన్ని నమ్మలేక పోతున్నాను. నేను నిజంగానే 2023 సంవత్సరంలో జీవిస్తున్నానా? అనిపించింది. 2023 ఏడాదిలో జీవించే ప్రజలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉందని భూపేంద్ర పేర్కొన్నాడు.
400 rupees for 2 Gulab Jamun, 3000 rupees kg Gajar halwa, after that 80% off. Can't believe that it is that much cheap. Am I really living in 2023?#Zomato is too generous for people living in 2023#zomatobanarhapagal, #createdinflation, #jiyetojiyekaise @deepigoyal pic.twitter.com/AdvFVbhBvu
— Bhupendra (@sbnnarka) January 22, 2023