ఉగ్రవాద కార్యకలాపాల్లో పాక్ ఆర్మీ ప్రమేయం ఉందంటూ గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. కానీ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. అయితే అవి ఆరోపణలు కావని, వాస్తవాలని భారత్ మరోసారి నిరూపించింది.
ఉగ్రవాదం ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసు స్పెషల్ స్పెల్ అరెస్టు చేసింది. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ ఆర్మీ అరెస్టు చేసిన చిత్రాన్ని వారికి ఇండియన్ ఆర్మీ చూపించింది.
ఆ ఫోటోలో అభినందన్ తో పాటు ఉన్న పాక్ ఆర్మీ అధికారి హమ్జాను వారిద్దరూ గుర్తించి అతన్ని తాము ఉగ్రవాద శిక్షణ శిబిరంలో కలిసినట్టు వారు ఒప్పుకున్నట్టు ఆర్మీ వెల్లడించింది.
ఈ మేరకు అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ ప్రకారం.. పాక్ ఆర్మీ అధికారులతో పాటు మరో తొమ్మిది మందిని ఆ ఇద్దరు నిందితులు గుర్తించారు. వీరిద్దిరికి పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థ ఉగ్రశిక్షణ ఇచ్చింది.
రావల్పిండిలో ఉగ్ర శిక్షణ తీసుకున్న 9 మందిలో ఒకరైన జబ్బర్ ను వారు గుర్తుపట్టారు. ఆ సమయంలో జబ్బర్ ఉగ్రశిక్షణకు హెడ్ గా ఉన్నట్టు వారు తెలిపారు. అభినందన్ ను అరెస్టు చేసిన సమయంలో జబ్బర్ కూడా తనతో ఉన్నట్టు హమ్జా తమకు చెప్పినట్టు నిందితులు వెల్లడించారు.