ప్లేట్ భోజనం చేస్తే 2 లక్షల బహుమతి….ఆఫర్ ను చూసి చొక్కాచేతులు పైకి మడిచి లాగించేయడానికి రెడీ అయిపోకండి! ఆ ప్లేట్ ను కంప్లీట్ చేయడం అంత ఈజీ కాదు ! ఢిల్లీలోని రోహిణీ ప్లాజా సెక్టార్ నెంబర్ 47 లో ఓ కుటుంబ్ రెస్టారెంట్ ఇచ్చిన ఆఫర్ ఇది!
వాళ్లు ఇచ్చే ఈ ప్లేట్ లో మొత్తం 18.5 కేజీల ఫుడ్ ఉంటుంది. పన్నీర్, వెజ్ కొల్హాపూరీ సోయా కర్రీ , చోలే, నాన్ రోటీ, ఖీర్ కుల్ఫీ, గులాబ్ జామ్, లస్సీలతో పాటు మొత్తం 45 రకాల ఫుడ్ వైరెటీలు ఉంటాయి! గట్టిగా మంచి ఆకలితో ఉన్న 5 గురు కలిసి తినడానికి కూర్చున్నా ఈ ప్లేట్ ను పూర్తిచేయలేరు. ఈ ప్లేట్ లోని ఫుడ్ ను 30 నిమిషాల్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి 2 లక్షల బహుమతిని ఇస్తామని ప్రకటించాడు ఆ హోటల్ యజమాని….ఇప్పటి వరకైతే ఎవ్వరూ ఆ ప్రైజ్ మనీని గెలుచుకోలేదు!