ఊహించని విధంగా రామ్ చరణ్ నటించిన 2 సినిమాలు నెల రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. కరోనా వల్ల రిలీజ్ డేట్స్ అలా సెట్ అయ్యాయి మరి. తాజాగా ప్రకటించిన తేదీల ప్రకారం చూసుకుంటే… నెల రోజుల వ్యవథిలో చరణ్ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి. అవే ఆర్ఆర్ఆర్, ఆచార్య మూవీస్.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 రిలీజ్ డేట్స్ వచ్చాయి. కుదిరితే మార్చి 18, కుదరకపోతే ఏప్రిల్ 28న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఇక ఆచార్య విడుదల తేదీని కూడా తాజాగా ప్రకటించారు. ఫిబ్రవరిలో రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి, ఏప్రిల్ 1 న థియేటర్లలోకి వస్తున్నట్టు తెలిపారు.
సో.. ఎలా చూసుకున్నా చరణ్ నుంచి నెల రోజుల గ్యాప్ లో 2 సినిమాలొస్తున్నాయన్నమాట. ఆర్ఆర్ఆర్ మార్చి 18కే వస్తుందనుకుంటే, అక్కడికి 2 వారాల గ్యాప్ లో ఆచార్య వచ్చేస్తుంది. పోనీ ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28న వస్తుందనుకుంటే.. అప్పటికే ఆచార్య విడుదలై 27 రోజులు అవుతుంది. సో.. ఎలా చూసుకున్నా.. నెల రోజుల్లోపే ఈ 2 సినిమాలు థియేటర్లలోకి రావడం పక్కా అని తెలుస్తోంది.