వైసీపీ ప్రభుత్వానికి 2022 విజయ నామ సంవత్సరమని ఏపీ గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ అన్నారు. అన్ని వర్గాల్లో ఆనందం నింపిన సంవత్సరంగా.. ఏ ఎన్నిక జరిగినా విజయ పరంపరతో గెలిచిన సంవత్సరం అని ఆయన అన్నారు. జగన్ నాయకత్వంలో 2022 వైసీపీ ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరంగా మిగిలిందన్నారు.
ఇక 2022 ఏడాది చంద్రబాబుకు మాత్రం బూతుల నామ సంవత్సరంగా మారిందన్నారు. ప్రతి ఎన్నికల్లో ఆఖరికి చంద్రబాబు అడ్డా కుప్పం మున్సిపాలిటీతో సహా ఘోరంగా ఓడిపోయిన సంవత్సరం ఇదే అని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ అయ్యన్నపాత్రుడు నుంచి దత్తపుత్రుడు వరకు 2022 బూతుల సంవత్సరం అయిందన్నారు. మళ్ళీ మా బీసీలంతా ఇస్త్రీ చేసుకుంటూ..మగ్గాలు నేయాలని చెప్తారా.. జగన్ ఏమో మా బీసీలంతా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చూస్తున్నారని.. అందుకే ట్యాబ్ లు,బైజూస్ కంటెంట్ తో చదువుకుని ప్రపంచాన్ని ఏలాలని చూస్తుంటే.. బాబు మాత్రం మళ్లీ చేపలు పట్టుకోవాలని,ఇస్త్రీ చేసుకోవాలని చెప్తున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు ఆయన కులం వాళ్లే ఇంగ్లీష్ చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తాడని.. అతనికి ఎందుకు అధికారం ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. కందుకూరులో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న పాపం బాబుదని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని ఎద్దేవా చేశారు.
బాబు అధికారం కోసం బాగా దిగజారిపోయారని.. కందుకూరు ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మళ్ళి బహిరంగ సభలు పెడుతున్నారని..అభం శుభం తెలియని వాళ్లు చనిపోతే పార్టీ కోసం త్యాగం చేశారని సిగ్గులేకుండా బాబు చెబతున్నారని మండిపడ్డారు.