త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపబోవని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోని పార్టీలు కేంద్రం వైపు వెళ్తుంటాయని, అందువల్ల ఈ ఫలితాలను జనరల్ ఎన్నికలతో ముడిపెట్టజాలమని ఆయన అన్నారు.
చాలామంది నేతలు జాతీయ రాజకీయాలకు కట్టుబడి ఉంటారు.. అలాంటివారే లౌకికవాద పార్టీలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి బధ్ధులై ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
కొన్ని పార్టీలు తమతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ తోడ్పాటు కోరుతాయని ఆయన తెలిపారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న దానిపై ఆయన యూ టర్న్ తీసుకున్నారు.
2024 లో విపక్షాలను తమ పార్టీ ముందుండి నడిపిస్తుందని తాను చెప్పలేదన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు భావసారూప్యం గల ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని ఖర్గే వ్యాఖ్యానించారు.