2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం నినాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫిర్ ఏక్ బార్.. మోడీ సర్కార్(మరోసారి మోడీ ప్రభుత్వం) అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నాయకులు ఏ సభకు వెళ్లినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సఫలీకృతులయ్యారు. అనుకున్నట్లే మరోసారి మోడీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 2024 వంతు వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ.. మోడీ హవా ఇక్కడే కాదు విదేశాల్లో కూడా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు ప్రధాని మోడీ. అక్కడ పలు దేశాధ్యక్షులు, ప్రవాసభారతీయులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో జర్మనీలోని బెర్లిన్ లో ఓ సభను నిర్వహించారు. భారత సంతతి వారంతా హాజరయ్యారు. అక్కడ ఒకటే నినాదం చాలా గట్టిగా వినిపించింది. అదే.. ‘ట్వంటీ ట్వంటీ ఫోర్.. మోడీ వన్స్ మోర్’.
2019 ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్.. మోడీ సర్కార్ ఎంత పాపులర్ అయిందో.. ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్.. మోడీ వన్స్ మోర్ కూడా అలాగే వైరల్ అవుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు 2024 నాటి ఎన్నికల కోసం గట్టి నినాదం లభించిందని కామెంట్లు పెడుతున్నారు కొందరు.
బెర్లిన్ కార్యక్రమం ఆసాంతం మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై, 2024 మోడీ వన్స్ మోర్ నినాదాలతో మార్మోగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
2024,
Modi Once More! pic.twitter.com/SEOmgEGS3k— BJYM (@BJYM) May 2, 2022