తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 2083 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64 వేల 786కి చేరింది. మరో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 530కి పెరిగింది.
యధావిధిగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 578 కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 228, వరంగల్ అర్బన్‌లో 134, కరీంనగర్‌లో 108, సంగారెడ్డి జిల్లాలో 101 కేసులు వెలుగు చూశాయి..
కరోనా నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 46 వేల 502 మంది కోలుకోగా.. 17 వేల 754 మంది చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 11 వేల 359 మంది హోం క్వారంటైన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.