తెలంగాణలో కరోనా వైరస్ అదే స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 21 వేల 436 శాంపిళ్లను పరీక్షించగా.. 2092 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73 వేల 50కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 589కి పెరిగింది.
కరోనా వైరస్ నుంచి నిన్న 1289 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 52 వేల 103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20 వేల 358 చికిత్స తీసుకుంటున్నారు..
తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 535 నమోదుకాగా.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 169, మేడ్చల్ -126, కరీంనగర్ -123, వరంగల్ అర్బన్- 128, సంగారెడ్డి జిల్లాలో 101 మంది కరోనా బారినపడ్డారు.