మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే సినిమా షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఇటీవల ఓ గ్రామం సెట్ వేశారట. దానికి సుమారు 20 కోట్లు ఖర్చు కూడా అయిందట. మొదటిగా గుడి సెట్ ను వేసరట. అందుకు నాలుగు కోట్లు ఖర్చు అయిందట. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా షూట్ చేశారట.
అయితే మొదటగా ఓ గుడి సెట్‌ను వేశారట. దానికి రూ.4 కోట్లు ఖర్చు అయ్యాయట. అక్కడ కొన్ని ముఖ్య మైన సన్నివేశాలను కూడా షూట్ చేశారు. అయితే ఇప్పుడు కేరళాలోని ఒక గ్రామం సెట్‌ను హైదరాబాద్‌లో వేశారు. దాంతో గుడితో కలుపుకొని వారికైన ఖర్చు రూ.20 కోట్లు. ఈ గ్రామం సెట్ దాదాపు 16ఎకరాల విస్తీర్ణంతో వేశారని, ఈ సెట్‌కు కావలసిన వాటన్నింటిని దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి చూసుకుంటున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది ఇప్పటికి 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వీలైనంత తొందరగా సినిమాని ముగించాలని చూస్తుంది.