కరోనా కొత్త రకం వైరస్ కలవరపెడుతున్న వేళ.. దేశంలో కొత్త కేసులు కంట్రోల్‌లో ఉండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 20 వేల 550 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 1,02,44,853కు చేరాయి. కొత్తగా 286 మంది మరణించడంతో మృతుల సంఖ్య 1,48,439కు పెరిగింది. కరోనా నుంచి తాజాగా 26,572 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 98.34 లక్షలకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 2.62 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు భారత్‌లోనూ కొత్త రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 20 మందికి ఈ వైరస్ సోకినట్లు కేంద్రం ధ్రువీకరించింది. బాధితులను వారి వారి రాష్ట్రాల్లో ఐసొలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్నవారికి కూడా గుర్తించి.. క్వారంటైన్‌కు పంపినట్టు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొత్త రకం కేసులు నిర్ధారణ కావడంతో ఇరు రాష్ట్రాల వైద్యారోగ్యశాఖలు అప్రమత్తం అయ్యాయి.