ఆయోధ్యలో రామజూలోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రావణశుక్ల తృతీయ నుంచి పూర్ణిమ వరకు వెండి ఉయ్యాలలో రాములోరికి ఈ జూలోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి ఉత్సవాల కోసం 21 కిలోల వెండి ఉయ్యాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళకరమైన గీతాలతో అయోధ్య రామయ్యను ఉయ్యాలలో వేసి జూలోత్సవం చేస్తుంటారు.
మరోవైపు ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2023 చివరి నాటికి భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చేలా ప్లాన్ చేశారు. తాజాగా మందిరం నిర్మాణ పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.