కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ఘటనల్లో ఇప్పటివరకు 21 మంది వరకు చనిపోయారు. 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సీఎం పినరయి విజయన్ కు ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు మోడీ.
ఇక కేరళలో పరిస్థితికి అద్దం పడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కొట్టాయం జిల్లాలో ఓ నది ఒడ్డున ఉన్న ఇల్లు నీటిలో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో బాగా ఫార్వార్డ్ అవుతోంది. ఆ ఇంట్లోని వ్యక్తులను ముందుగానే అధికారులు ఖాళీ చేయించారు.