మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ తో ఎగ్ బోస్టన్ లో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది.
లీసెస్టర్ షైర్ తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్ లో పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ వైఫల్యంపై తీవ్ర వివమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడని లీసెస్టర్ షైర్ ఆటగాడు రోమన్ వాకర్ బౌలింగ్ ను ఎదుర్కోలేక టీమ్ ఇండియా బ్యాటర్లు పెవీలియన్ బాట పట్టారు.
భారత టాప్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హనుమ విహారీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ లను తక్కువ స్కోర్లకే వాకర్ ఔట్ చేశాడు. దీంతో భారత ఆటగాళ్ల ఆటతీరుపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా మండిపడుతున్నారు.