జమ్మూలోని ఉధంపూర్‌కు చెందిన సర్దార్ గోరఖ్ సింగ్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేయడంతో అతడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణ కోసం ఆటో నడపడం ప్రారంభించాడు. అయినప్పటికీ కేవలం అతడి సంపాధన మీద కుటుంబ అవసరాలు తీరకపోవడంతో….. గోరఖ్ సింగ్ 21 ఏళ్ల కుమార్తె బంజిత్ కౌర్ ముందుకు వచ్చి తనూ ఆటో నడపడం ప్రారంభించింది. ఇలా తండ్రికి తోడుగా సంపాదిస్తూ కుటుంబాన్ని ముందుకు నడుపుతోంది.
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న బంజిత్… ఆన్ లైన్ క్లాసులు ముగిశాక ఆటో తీసుకొని ప్యాసింజర్స్ ను ఎక్కించుకొని వారివారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. కొడుకులు లేరనే బాధ నాకు లేదు….నన్ను అర్థం చేసుకునే కూతురు ఉన్నందుకు, కొడుకులా కుటుంబ బాధ్యతను తీసుకున్నందకు గర్వపడుతున్నాను అన్నాడు తండ్రి గోరఖ్ సింగ్.