ఈజిఫ్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిన్యా రాష్ట్రంలో లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మంది మరణించారు. మరో 33మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
బస్సు మిన్యా రాష్టం నుంచి రాజధాని కైరోకు వెళుతోంది. ఈ క్రమంలో ఆల్ బర్ష వద్ద ఆగివున్న లారీని బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. టైర్ ను మార్చేందుకు గాను లారీని రోడ్డు పక్కన పార్క్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈజిప్ట్ లో ప్రతియేటా రోడ్డు ప్రమాదాల బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక వేగం, రోడ్ల పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.