తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. వరుసగా రోజుకి రెండు వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2256 మంది కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77 వేల 513కి చేరింది. కరోనా కారణంగా మరో 14 మంది చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 615కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1091 మంది కరోనా నుంచి కోలుగా కోలుకోగా.. ఇప్పటివరకు 54 వేల 330 మంది డిశ్చార్జ్ అయ్యారు.
వైద్యారోగ్యశాఖ విడుదల చేసి తాజా బులెటిన్‌ను వివరాలను పరిశీలిస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 464 మంది కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలో భారీగా 187 కేసులు వెలుగుచూశాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇంత ప్రమాదకర స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్-138, కరీంనగర్ జిల్లాలో 101 కేసులు బయటపడ్డాయి.