తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 226 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 39 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. అటు నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,584కి పెరిగింది.కరోనా బారి నుంచి తాజాగా 224 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2,87,117కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,920 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,322 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.