తీహార్ జైలులో అనుమానాస్పదంగా కనిపించిన కొందరు ఖైదీలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని తనిఖీ చేయగా ఓ ఖైదీ వద్ద ఓ ప్యాకెట్ లభించింది. అందులో 23 సర్జికల్ బ్లేడ్‌లు వున్నాయి. దీంతో పాటు అతని దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్, మాదక ద్రవ్యాలు, సిమ్ కార్డులను జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై జైలు అధికారలు దర్యాప్తు ప్రారంభించారు. బయటి నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆ ప్యాకెట్ ను జైలు లోపలికి విసిరినట్టు అధికారులు గుర్తించారు. ఆ ప్యాకెట్ ను ఎవరి కోసం తీసుకు వచ్చారు, ఎందుకోసం తీసుకు వచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా వుంటే కరుడు గట్టిన ఖైదీలు ఉండే జైల్‌లో మనీశ్ సిసోడియాను ఉంచారంటూ ఆమ్ ఆద్మీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. సిసోడియాను హత్య చేసేందుకే ఆయన్ని అక్కడ ఉంచారంటూ ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఇటీవల ఆరోపించారు.
అసలు మొదటిసారి ఖైదీ అయిన వ్యక్తిని అలాంటి నేరస్థులతో ఉంచుతారా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. విచారణలో ఉన్న ఖైదీని సెల్ నెంబర్1లో ఉంచరని మరోనేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అందులో హంతకులు, కరడుగట్టిన నేరస్తులను ఉంచుతారని పేర్కొన్నారు.