మన తెలుగులో కొన్ని కొన్ని పదాలు ఆసక్తికరంగా ఉంటాయి గాని వాటి గురించి పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయం. గురువారం ను లక్ష్మి వారం అని ఎందుకు అంటారు…? 25 ని పాతిక అని ఎందుకు పిలుస్తారు వంటివి చాలా మందికి అవగాహన లేదు. అసలు పాతిక అనే మాట చరిత్ర ఏంటీ… ఏ భాష నుంచి అలా వచ్చింది అనేది చూద్దాం.
Also Read:ఈ సంబురం.. మరో సమరానికి నాంది..!
సాధారణంగా వంద ( నూరు ) ని ప్రాతిపదికగా చెప్తారు అందరూ. మార్కుల గురించి చెబుతున్నపుడు వందకి ఎన్నివచ్చాయో అని చూసి దాన్ని శాతంలో లెక్కించడం జరుగుతుంది. ఇక అన్ని విషయాల్లో కూడా ఇదే జరుగుతుంది. డబ్బు విషయంలో కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళారు. రూపాయి ని విభజించిన సమయంలో, అందులో సగమైతే అర్థ, నాలుగో భాగాన్ని పాతిక అని విభజించారు అప్పట్లో. ఆ రకంగా ఇరవై అయిదు పాతిక అయింది అయిందని కొందరు చెప్తారు. ఇక 14 ని పరక అని చెప్తూ డజన్, పాతిక, పరక అని అమ్ముతూ ఉంటారు.
తమిళములో ఇరు పత్తి అయింతు అంటే 25. పత్తి తెలుగునకు పాతిక గా రూపాంతరం చెందింది అనే వాళ్ళు ఉన్నారు. పాతిక అన్న పదం ప్రాకృత పదమైన పాదిక నుంచి వచ్చింది అనేది చరిత్ర కారులు చెప్పే మాట. తెలుగులోనే కనిపించే పావు అన్న పదం సైతం ఇలానే వచ్చింది. ప్రాకృతంలో ‘పాదిక’ అన్నది సంస్కృతంలోని పాదః, పాదకః అన్న పదాల నుంచి వచ్చినట్టుగా భాషా పండితులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆధునిక ఇండో-ఆర్యన్ భాషల ద్వారా కాకుండా ప్రాచీన ప్రాకృతాలనుండి పాదిక- నుండి వచ్చి పాతికగా మారిందట. ఆ తర్వాత మరాఠి భాష నుంచి పావు అనేది కూడా వచ్చి చేరింది.
Also Read:విమానం టాయిలెట్ లను ఎలా క్లీన్ చేస్తారు…? లీక్ అయితే పరిస్థితి ఏంటీ…?