మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోడీ మే2న బయలు దేరి వెళ్లనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ఆయన సుమారు 25కు పైగా సమావేశాల్లో పాల్గొంటారని వెల్లడించాయి.
మూడు రోజుల పాటు ఆయన సుమారు 65 గంటల పాటు ఆయన పర్యటించనున్నట్టు చెప్పాయి. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌లలో ఆయన పర్యటిస్తారని తెలిపాయి.
ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది నేతలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలను మోడీ నిర్వహిస్తారని తెలిపాయి. వీటితో పాటు 50 మంది వ్యాపారవేత్తలతో మోడీ సమావేశం కానున్నట్టు పేర్కొన్నాయి.
ఈ ఏడాదిలో ప్రధాని మోడీకి ఇది తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. మొదట ఆయన జర్మనీకి వెళతారని, అక్కడ నుంచి డెన్మార్క్ కు వెళతారని వివరించాయి. ఆ తర్వాత ప్యారీస్ కు వెళ్లి మే4న భారత్ కు తిరిగి వస్తారని తెలిపాయి.