ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా పయనిస్తోంది. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో మరో 25 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2230 కు చేరుకుంది. తాజాగా నమోదు అయిన కేసుల్లో చిత్తూరు 4, గుంటూరు 4, కర్నూల్ 3, నెల్లూరు 1, ప్రకాశం 3, శ్రీకాకుళం 7, విశాఖ లో 3 కేసులు నమోదు అయ్యాయి.
9,880 సాంపిల్స్ ని పరీక్షించగా 25 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. 103 మంది కోవిడ్ నుండి కోలుకొని గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా కృష్ణ జిల్లాలో లో ఒకరు మరణించారు. మొత్తం రాష్ట్రం లోని నమోదైన 2230 పాజిటివ్ కేసు లకు గాను 1433 మంది డిశ్చార్జ్ కాగా, 50 మంది మరణించారు. ప్రస్తుతం 747 మంది చికిత్స పొందుతున్నారు.