దేశంలో కరోనా విలయంతాండవం చేస్తోంది. థర్డ్ వేవ్ లో ఎక్కువగా ప్రముఖులు మహమ్మారి దాటికి గురవుతోంది. తాజాగా సుప్రీం కోర్టులో ఏడుగురు జడ్జీలు కరోనాబారిన పడటం కలకలం రేపుతోంది. వారితో పాటు కోర్టులో పని చేసే 250మంది సిబ్బందికి ఈ మహమ్మారి సోకింది. దీంతో పలు విభాగాల్లో పని చేస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, కోర్టు కేసులను ప్రత్యక్షంగా విచరాణ చేపట్టకుండా.. గతంలో వలే వర్చువల్ విచారణ చేసేలా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
భారత్ లో రోజువారీ కేసులు భారీగా నమోదవున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,79,723 మంది వైరస్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కి చేరుకుంది. ఈ రోజు పాజిటివిటీ రేటు 13.29 శాతానికి నమోదు చేసుకుంది. దీంతో, వైద్య అధికారులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.
ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా నమోదైన కేసులతో పాటు మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 4,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జోన్ల వారీగా చర్చలు జరిపారు. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నచోట అధికారులు సైతం వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు. కంటైన్‌మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.