ఇండియాలో గత కొన్నిరోజులుగా రికార్డ్ స్ధాయిలో కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు కాస్త స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,58,089 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే మరోవైపు ఇదే సమయంలో 385 మంది మృతి చెందారు.
అలాగే గడిచిన 24 గంటల్లో 1,51,740 మంది ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 16,56,341 యాక్టీవ్ కేసులు ఇండియా లో ఉన్నాయి.
అయితే పాజిటివిటీ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.