దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరికొంత అదుపులోకి వస్తున్నట్టే కనిపిస్తోంది. ప్రజల్లో అవగాహన పెరగడంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 26,382 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 99.32 లక్షలకు చేరింది. ఇక కరోనా కారణంగా నిన్న 387 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 లోపు మరణాలు నమోదు కావడం వరుసగా ఇది మూడో రోజు. కాగా ఇప్పటివరకు వైరస్ కారణంగా ఇప్పటివరకు లక్షా 44 వేల 96 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు రికవరీ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. ఇప్పటిదాకా 94.56 లక్షల మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3.32 లక్షలకు పడిపోయింది. దేశంలో 50 శాతం కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.