దేశంలో కరోనా వైరస్ తీవ్రత నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26 వేల 624 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య కోటీ 31వేల 223కు చేరింది. కరోనా కారణంగా కొత్తగా 341 మంది మరణించారు. వీరితో కలిపి దేశంలో ఇప్పటివరకు లక్షా 45 వేల 477 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.
కరోనా బారి నుంచి నిన్న 29 వేల 690 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో 95.80 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. మిగిలిన 3.05 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా దాకా 16.11 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.