తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 27,471 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 267 మందిలో పాజిటివ్ తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,395కి చేరింది. ఇక నిన్న కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు1,583కి పెరిగాయి.
కరోనా వైరస్ నుంచి నిన్న 351 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2,86,893కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,919గా ఉంది. ఇందులో 2,270 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 75.42 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.