పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు చమురు ధరల కారణంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) గ్యాస్ సిలిండర్ల ధర ఈ ఏడాదిలో భారీగా పెరిగింది. కేంద్రం కట్టడి చేయాలని భావించినా కొన్ని కారణాలతో అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే త్వరలోనే కేంద్రం తగ్గించే అవకాశం కనపడుతుంది. అయితే ఇప్పుడు పేటిఎం సంస్థ తన వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఎల్పీజీ బుకింగ్ విషయంలో ఇప్పటికే పలు సంస్థలు క్యాష్ బ్యాక్ ఆఫర్ లు ఇస్తూ ఉండగా పెటియెం లేటెస్ట్ గా సంచలనం సృష్టించింది.
సిలిండర్ బుకింగ్‌పై రూ. 2700 క్యాష్‌బ్యాక్ పొందవచ్చని ప్రకటించింది. యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్‌లను బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. సిలిండర్‌లను బుక్ చేసుకునే కస్టమర్‌లు రూ. 2,700 వరకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందవచ్చని ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక షరతు విధించింది సంస్థ. ఇందులో కొత్త కస్టమర్‌లు మూడు నెలల పాటు గ్యాస్ సిలిండర్‌లను వరుసగా బుకింగ్ చేస్తే రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చని తెలిపింది. అంటే మూడు నెలలు వరుసగా బుక్ చేసి ఉంటేనే క్యాష్ బ్యాక్ వస్తుంది.
Advertisements
ఆఫర్ నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఒక్కసారి చూస్తే… కొత్త వినియోగదారులకు క్యాష్ బ్యాక్ రూ. 10 నుండి రూ. 900 వరకు ఉంటుందని సంస్థ పేర్కొంది. పాత కస్టమర్ లు ప్రతి బుకింగ్ పై కూడా రివార్డ్ లను పొందవచ్చు. ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్‌లను బుక్ చేసుకునేందుకు వారు గరిష్టంగా 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్‌లను పొందే అవకాశం కల్పించారు.