ఇండియాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 2796 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,633,255 కు పెరిగింది. మరణాల సంఖ్య 473,326 కు చేరింది.
ఇక ప్రస్తుతం దేశంలో 99,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే మరోవైపు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,27,61,83,065 మంది కరోనా వాక్సిన్ వేసుకున్నారు.