యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కింత `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది.
ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో దూసుకెళ్తోంది.ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకైనా గోల్డెన్ గ్లోబల్ అవార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రానికి.. తాజాగా మరో రెండు అవార్డులు లభించాయి. ఎపిక్ పీరియడ్ డ్రామా 28వ వార్షిక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో `ఆర్ఆర్ఆర్` రెండు అవార్డులను గెలుచుకుంది.
బెస్ట్ ఫారెన్ లాగ్వేజ్ మూవీ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలిసి స్టేజ్ మీదకు వెళ్లి అందుకున్నారు.అలాగే ఇందులోని `నాటు నాటు` పాట బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఎంపికైంది.
ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. `ఆర్ఆర్ఆర్`కి అవార్డుల పంట పండుతుండటంతో చిత్ర టీమ్ ఫుల్ జ్యోష్‌లో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా అస్కార్ అవార్డు అందుకుంటుందని ఇండియన్ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.