ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు పిర్యాదు చేసిన పట్టించుకోకుండా వదిలేశారని స్థానికులు ద్వారా తెలిసింది. తల్లిదండ్రులు పిర్యాదు చేయగానే పోలీసులు స్పందించలేదు మా పరిధి కాదంటూ కాలయాపన చేసినట్లు తల్లిదండ్రులు మా దృష్టి కి తీసుకొచ్చారు.
కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌ను సీపీ సజ్జనార్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరణలో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులపై సీపీ చర్యలు తీసుకున్నారు