మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగ్లీ జిల్లాలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై కంటెయినర్ ట్రక్కును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
పోలీసుల వివరాల ప్రకారం… పూణేకు చెందిన అరింజయ్ శింగ్రే అనే వ్యక్తి తన బందువులను జయసింగపూర్ లో డ్రాప్ చేయడానికి కారులో వెళుతున్నాడు. యెవలేవాడి ప్రాంతంలో కంటెయినర్ ట్రక్కును కారు ఢీ కొట్టింది.
దీంతో కారులో ఉన్న మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులను అరింజయ్ శింగ్రే(35), స్మితా శిరోతే(38), పూర్వ శిరోతే (14), సునేశ శిరోతే(10), వీరు శిరోతే(4)గా పోలీసులు గుర్తించారు. అతివేగం వల్లే కారు ప్రమాదానికి గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.