అమెరికాలో గన్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. గత వారం టెక్సాస్ లోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 19 మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు.
ఈ ఘటన మరువక ముందే అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక్లహామ్ లో తుల్సా హాస్పిటల్ లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఫిలిప్ కోసం దుండగుడు ఆస్పత్రికి వచ్చాడు.
కానీ ఆసమయానికి సర్జన్ అక్కడ లేకపోవడంతో సహనం కోల్పోయిన ఆ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో తన జేబులోంచి తుపాకీని తీసి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. కాల్పుల అనంతరం ఆ వ్యక్తి తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.