ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అందరికీ తెల్సిన సూత్రమే అయినా దీన్ని పాటించడంలో మాత్రం అందరం వెనకబడిపోతున్నాం. కొన్ని తెలిసి చేసే తప్పులు , మరికొన్ని తెలియక చేసే తప్పులు వెరసి మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నాం.
ఉదయం లేవగానే…. చాలా మంది చేస్తున్న 3 తప్పులు.
1) లేచీ లేవగానే స్నానం చేయరాదు. ఎందుకంటే అప్పటి వరకు మన బాడీ టెంపరేచర్ కు సడెన్ గా నీటి టెంపరేచర్ కు బ్యాలెన్స్ అవ్వక జ్వరాలు వచ్చే అవకాశముంది. అందుకే నిద్రలేవగానే స్నానం చేయకూడదు.
2) పరగడుపున నీళ్లు:
ఈ మధ్య పరగడుపున నీళ్లు తాగడం ఎక్కువైంది. కానీ కనీసం పుక్కింలించైనా నీళ్లు తాగడం మంచిది. లేదంటే రాత్రి తిన్న అన్నం తాలూకూ వ్యర్థాలు మన నోట్లో అలాగే ఉండి….అవి కడుపులోకి వెళ్లి ఇన్ఫెక్షన్లకు, కడుపునొప్పులకు కారణమౌతాయి.
3) ఉదయం లేవగానే టీ , కాఫీలు
బ్రష్ చేయగానే టీ , కాఫీలు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంది ఇలా చేయడం తప్పు. ఉదయాన్నే టీ కాఫీల కారణంగా ఎసిడిసీ , గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.