అసోంలో వరద పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. అధికారులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలో జపనీస్ మెదడు వాపు వ్యాధి విజృంభిస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 35 మంది మరణించారు. జూలై లో ఇప్పటి వరకు మొత్తం 226 ఎన్ సెఫలైటీస్ వ్యాధులను అధికారులు గుర్తించారు.
ఈ వ్యాధి బారిన పడి గత 24 గంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 35కు చేరుకుంది. ఈ రోజు మొత్తం 24 కొత్త కేసులను నివేదించింది.
నాగావ్, బిస్వనాథ్ జిల్లాలో 4 చొప్పున, జోర్హాట్ జిల్లాలో 3, కమ్రూప్, ధేమాజీ, లఖింపూర్, సోనిత్‌పూర్, నల్బరీ, బక్సా, చిరాంగ్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.