రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ రోజు మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చైర్మన్ వెల్లడించారు.
సస్పెన్షన్ కు గురైన వారిలో అజిత్ కుమార్ భుయాన్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాటక్‌లు ఉన్నారు. ఇప్పటికే మంగళ వారం 19 మందిని సస్పెండ్ చేశారు.
ప్లకార్డులు పట్టుకుని, వెల్‌లోకి దూసుకువచ్చి సభకు ఆటంకం కలిగించిన ఎంపీలపై చైర్మన్ చర్యల తీసుకున్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణంతో పలు అంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి.
సస్పెన్సన్ కు గురైన ప్రతిపక్ష ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. మొత్తం ఇప్పటి వరకు 23 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది.