తెలంగాణలో కొలువుల పండుగ నడుస్తోంది. తాజాగా నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరోసారి శుభవార్త చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1, పోలీసుల నోటీఫికేషన్లు వచ్చాయి.
ఇటీవల గ్రూప్ 2, 3,4 నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో మూడు నోటిఫికేషన్లను కేసీఆర్ సర్కార్ జారీ చేసింది. కాలేజి ఎడ్యుకేషన్‌లో 544 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. ఇక మున్సిపల్ శాఖలో 78 పోస్టులకు ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ఇచ్చింది.
దీనికి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే ఇంటర్ సాంకేతిక విద్యలో 71 పోస్టులకు నోటిఫికేషన్ విడులైంది. దీనికి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.