ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో కుందేడ్ అటవీ ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్‌డ్ గార్డ్(డీఆర్‌జీ) పోలీసులు కూంబింగ్ కు వెళ్లారు.
ఆ సమమంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. ఈ క్రమంలో పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు.
వారిలో డీఆర్‌జీ ఏఎస్ఐ రామ్‌నాగ్, కానిస్టేబుల్ కుంజమ్ జోగా, వంజం భీమాలు వున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.
అటవీ ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపుతున్నట్టు తెలుస్తోంది. మృతదేహాలను సమీపంలోని క్యాంపునకు తరలించినట్టు తెలుస్తోంది. ముగ్గురు జవాన్ల మరణంపై చత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘెల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గపు చర్యను ఖండిస్తున్నామన్నారు. జవాన్ల త్యాగం వృధాగా పోదన్నారు.