కర్నాటకలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ప్రమాదాన్ని ముందుగా గుర్తించడంతో ప్రాణనష్టం తప్పింది. బెంగళూరులో జరిగిందీ సంఘటన.
భవనం ఓవైపునకు ఒరిగి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. ఏ క్షణంలోనైనా కూలుతుందేమోనని ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. అధికారులు కూడా స్పాట్ కు చేరుకుని అందులో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత బిల్డింగ్ కూలింది. ఆ సమయంలో దాని పక్కనే భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
భవనం కూలుతున్న వీడియోను మీరూ చూసేయండి.